1. గోల్డ్ లోన్ అంటే ఏమిటి?
బంగారం లేదా ఆభరణాలపై మీరు తీసుకునే రుణాన్ని గోల్డ్ లోన్ అంటారు. నిర్ధిష్ట మొత్తానికి ప్రతిఫలంగా మీరు మీ బంగారాన్ని బ్యాంకుకు అప్పగిస్తే దానిని గోల్డ్ లోన్‌గా పరిగణిస్తారు. వేగంగా మరియు సులభతరమైన నిర్వహణ ద్వారా మీ బంగారంపై రుణాన్నిఅతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో కాంపిటేటివ్ గోల్డ్ లోన్ వడ్డీ రేట్లకు సౌకర్యవంతమైన కాల పరిమితితో పొందండి.
2. గోల్డ్ లోన్ పొందడానికి ఎవరు అర్హులు?
వ్యాపారవేత్త, ట్రేడర్, రైతు, వేతన లేదా స్వయం ఉపాధి కలిగిన వ్యక్తి అయిన 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న భారతీయ నివాసి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ద్వారా గోల్డ్ లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటాడు. మీరు మా గోల్డ్ లోన్ ఎలిజిబిలిటి క్యాలిక్యులేటర్ ద్వారా మీ అర్హతను తనిఖీ చేసుకోవచ్చు.
3. గోల్డ్ లోన్‌కు దరఖాస్తు చేయడానికి ఏ డాక్యుమెంట్లు అవసరం?
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్‌లో మీ బంగారం మీద రుణాలు పొందడానికి కావాల్సిన డాక్యుమెంట్లు:
- ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్
- PAN (పర్మినెంట్ అకౌంట్ నెంబర్) Card (కింద పేర్కొన్న డ్యాక్యుమెంట్లతో ఏదైనా ఒకదానితో కలిపి) లేదా ఫాం 60
- పాస్‌పోర్ట్ (గడువు తేదీ దాటని /చెల్లుబాటులో ఉన్నది )
- డ్రైవింగ్ లైసెన్స్ (గడువు తేదీ దాటని /చెల్లుబాటులో ఉన్నది )
- ఓటర్ గుర్తింపు కార్డు
- UIDAI ద్వారా జారీ అయిన ఆధార్ కార్డ్
- అగ్రి అలైడ్ ఆక్యుపేషన్ డాక్యుమెంటేషన్ (వ్యవసాయ ఖాతాదారులకు బుల్లెట్ రీపేమెంట్ జరిగినట్లయితే)
4. గోల్డ్ లోన్‌కు మీరు ఎప్పుడు దరఖాస్తు చేయాలి?
మీ నిర్దిష్ట అవసరాలకు డబ్బు అవసరమైనప్పుడు మీరు బంగారంపై రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిధుల విడుదలకు మీకు దగ్గరలోని ఏ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ శాఖలోనైనా 45 నిమిషాలు పడుతుంది. మీరు ఈ సౌలభ్యాన్ని అత్యవసర సమయంలో గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడం కోసం వినియోగించుకోవచ్చు.
5.ఒకవేళ గోల్డ్ లోన్ చెల్లించకపోతే ఏం జరుగుతుంది?
గోల్డ్ లోన్ తిరిగి చెల్లించని పక్షంలో బ్యాంక్ వాయిదాల చెల్లింపునకు సంబంధించిన విషయాన్ని రుణగ్రహీతకు ఇమెయిల్ మరియు టెక్ట్స్ రిమైండర్ల ద్వారా సమాచారం చేరవేస్తుంది. నిర్ధిష్ట కాలం తరువాత గోల్డ్ లోన్ మొత్తంపై నిర్ధిష్ట పీనల్ ఛార్జీలు లేదా వడ్డీ రేట్లు విధించబడతాయి. చివరికి బ్యాంకు నిర్దేశించిన గడువులో వరుస ఫాలో–అప్ల తర్వాత కూడా గోల్డ్ లోన్ మొత్తాన్ని చెల్లించకపోతే, బ్యాంకు బంగారు ఆభరణాలను విక్రయించి లేదా వేలం వేసి లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి ముందుకు వెళుతుంది.
6.నేను గోల్డ్ లోన్ని ఏవిధంగా తిరిగి చెల్లించవచ్చు?
మీ బంగారం మీద తీసుకున్న రుణాన్ని పరిమిత కాల పరిమితికి, నిర్దిష్ట వడ్డీరేట్లతో సులభ వాయిదాల్లో తిరిగి చెల్లింవచ్చు. టర్మ్ లోన్, ఓవర్ డ్రాఫ్ట్ లేదా బుల్లెట్ రీపేమెంట్ ఫెసిలిటీపై లోన్ ఎంపికలు కలవు. మీరు ప్రతి నెలా వడ్డీని లేదా ప్రతి నెలా సాధారణ ఈఎంఐని తిరిగి చెల్లించడానికి ఎంచుకోవచ్చు. మీ నెలవారీ అవుట్ ఫ్లో రూ. 1 లక్షకు రూ. 1,000 (ఇది సంవత్సరానికి 12% యొక్క ఇండికేటివ్ రేటుపై ఆధారపడి ఉంటుంది) వరకు ఉండవచ్చు. మీరు బుల్లెట్ రీపేమెంట్ సౌలభ్యాన్ని ఎంచుకుంటే, 1 సంవత్సరం తరువాత వడ్డీ మరియు అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.
7.నేను నా గోల్డ్ లోన్ని ముందస్తుగా రద్దు చేయవచ్చా లేదా ముందస్తుగా చెల్లించవచ్చా?
అవును, మీరు మీ గోల్డ్ లోన్ని ముందస్తుగా క్లోజ్ చేయవచ్చు లేదా ముందస్తుగా చెల్లించవచ్చు. అయితే కొన్ని ఛార్జీలు వర్తిస్తాయి. ముందస్తు చెల్లింపు లేదా ముందస్తు క్లోజ్ కోసం బంగారంపై రుణం తీసుకున్న 6 నెలల్లోపు అయితే 2% + జీఎస్టీ ఉంటుంది. ఒకవేళ 6 నెలల తర్వాత అయితే ఎలాంటి ఛార్జీలు ఉండవు.
తక్కువ చూడండి